Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -హైదరాబాద్
సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో గురువారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో ఆరుగురు వ్యక్తులు దుర్మరణం చెందడంపై తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ విచారం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో మతి చెందిన వారికి సంతాపం, కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను కాపాడేందుకు అవసరమైన అన్నిరకాల వైద్యసేవలను అందించాలని కోరారు. ఈ అగ్ని ప్రమాద ఘటనపై తక్షణమే పూర్తిస్థాయిలో విచారణకు ఆదేశించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మతుల కుటుంబాలకు తక్షణమే రూ.50 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలనీ, పక్కా ఇండ్లు, ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి అన్ని విధాలా ఆదుకోవాలని సూచించారు. హైదరాబాద్ నగరంతోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రధాన నగరాల్లో షాపింగ్ కాంప్లెక్స్‌ల్లో తరచూ అగ్నిప్రమాదాలు జరుగుతున్న కారణంగా ఎంతో మంది మరణించడం బాధాకరమన్నారు. ఇలాంటి అగ్ని ప్రమాదాలను నివారించేందుకు సంబందిత శాఖల అధికారులు ముం దస్తు ప్రణాళికలతో సంయుక్తంగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.