Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పరీక్షలు రద్దుచేస్తే సరిపోదనీ, ప్రతి అభ్యర్థికీ పరీక్షలయ్యే వరకు నిరుద్యోగ భృతిని నెలకు రూ.25,000 చెల్లించాలని సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి అశోక్ శుక్రవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వమే బాధ్యత వహించాలని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన తొమ్మిదేండ్ల తర్వాత జరుగుతున్న టీఎస్పీఎస్సీ పరీక్షలు నిర్వహించిం దని తెలిపారు. ఏనాడు లేనంత అధ్వాన్నంగా ఈ పరీక్షలు జరిగాయని పేర్కొన్నారు. 30 లక్షలమంది విద్యార్థులు జీవితాలతో చెలగాట మాడుతూ పరీక్షలను రద్దు చేసిందని తెలిపారు. దీనికి కారణమైన సూత్రధారులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.