Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆప్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు దిడ్డి సుధాకర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మోడీ ఫాసిస్టు కుట్రలను భారత ప్రజలు తిప్పికొడతారని ఆప్ తెలంగాణ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు డాక్టర్ దిడ్డి సుధాకర్ హెచ్చరించారు. భారత స్వాతంత్ర పోరాటంలో బీజేపీ పాత్ర లేదని ఆయన పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ నాయకులు బ్రిటిష్ పాలకులకు తొత్తులుగా మారి 'విభజించు - పాలించు' విధానానికి మద్దతు పలికారని విమర్శించారు. భగత్‌సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, సుభాష్ చంద్ర బోస్, సర్దార్ వల్లభారుపటేల్ లాంటి స్వాతంత్ర సమరయోధుల వారసత్వాన్ని బీజేపీ కైవసం చేసుకోవడం దుర్మార్గమని తెలిపారు. విప్లవ యోధులు సర్దార్ భగత్‌సింగ్, శివరామ్హరి రాజ్‌గురు, సుఖ్‌దేవ్ థాపర్ 92 వ వర్ధంతిని పురస్కరించుకుని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ శాఖ రూపొందించిన గోడ పత్రికను హైదరాబాద్‌లోని ఆప్ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం సుధాకర్ తోపాటు ఆప్ తెలంగాణ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు బుర్ర రాము గౌడ్, శోభన్ భూక్యా తదితరులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 23 న తమ రాష్ట్ర కార్యాలయం నుంచి ఇందిరా పార్క్ వరకు కాగడాల ప్రదర్శన నిర్వహించనున్నట్టు తెలిపారు. అనంతరం జరిగే బహిరంగ సభలో భగత్ సింగ్, సుఖఃదేవ్, రాజగురులకు నివాళులు అర్పిస్తామని వెల్లడించారు.