Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండ్రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షసూచన
- అక్కడక్కడా వడగండ్లు పడే అవకాశం
- 150కి పైగా ప్రాంతాల్లో పడిన వర్షం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వచ్చే రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి కె.నాగరత్న తెలిపారు. నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిర్మల్ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. ఆ జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడంతో పాటు పలుచోట్ల వడగండ్లు కూడా పడే అవకాశం ఉందని హెచ్చరించింది. అక్కడక్కడా భారీ వర్షాలు పడొచ్చని తెలిపింది. దక్షిణ తమిళనాడు నుంచి తమిళనాడు, రాయలసీమ, తెలంగాణ, విదర్భ మీదుగా ఉత్తర కొంకణ్ వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతున్నది. శుక్రవారం రాత్రి 8:30 గంటల వరకు రాష్ట్రంలో 132 ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. సంగారెడ్డి జిల్లా నాగల్గిద్దలో అత్యధికంగా 5.18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 25కుపైగా ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. పలుచోట్ల వడగండ్లు పడ్డాయి.