Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిందితులు ప్రవీణ్,రాజశేఖర్ రెడ్డి ప్రాణాలకు ప్రమాదం: బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ నిర్వహించిన ఉద్యోగ పరీక్షల పేపర్ లీకేజీ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఆ పార్టీ కార్యాలయంలో ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు ప్రవీణ్‌కుమార్‌ను ఇంటి వద్ద హౌజ్ అరెస్టు చేశారు. దీంతో ఆయన ఇంట్లోనేే దీక్షను కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30లక్షల మంది నిరుద్యోగ యువతకు అన్యాయం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీ అంశానికి సంబంధించి నిందితులు ప్రవీణ్, రాజశేఖర్‌రెడ్డిల ప్రాణహాని ఉందనీ,అదే జరిగితే.. పేపర్ లీకేజీలో అసలు దోషులు తప్పించుకుంటారని తెలిపారు. టీఎస్పీఎస్సీ చైర్మెన్ జనార్ధన్‌రెడ్డిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో బండి సంజయ్ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు.