Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో మెగా టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేస్తున్నందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీకి తెలంగాణ స్టేట్ ఫెడరేషన్ ఆఫ్ టెక్స్టైల్ అసోసియేషన్స్ అధ్యక్షులు అమ్మనబోలు ప్రకాశ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. టెక్స్టైల్ పార్కు రాకతో ఈ రంగంలో వ్యాపారుల కష్టాలు తీరుతాయని తెలిపారు. గతంలో ఇతర ప్రాంతాల నుంచి స్టాక్ తెచ్చుకుని నిల్వ ఉంచుకోవడం ద్వారా ఆ డిజైన్లు కాలం చెల్లి నష్టాలు వాటిల్లే దుస్థితి తప్పుతుందని పేర్కొన్నారు. పత్తి అధికంగా ఉత్పత్తి అయ్యే తెలంగాణలో ఈ పార్కు ఏర్పాటుతో యువతకు ఉద్యోగాల కల్పనతో పాటు ప్రభుత్వానికీ ఆదాయం పెరుగుతుందని వివరిచారు.