Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మనువాద పునరుద్ధరణను తిప్పికొట్టాలని తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం (టీపీఎస్కే) పిలుపునిచ్చింది. శనివారం టీపీఎస్కే కార్యదర్శి కె.హిమబిందు అధ్యక్షతన రాజ్యాంగ హక్కులన్నీ మహిళల హక్కులే అనే అంశంపై సాంస్కృతిక సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా హిమబిందు మాట్లాడుతూ ప్రభుత్వాలు హిందుత్వం పేరుతో మనవాద పునరుద్ధరణను తీసుకొస్తున్నాయనీ, అన్ని రంగల్లో స్త్రీని బానిసగా చూసే విధానాన్ని ముందుకు తెస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. స్త్రీలపై జరిగే హింసను, అణచివేతను, వివక్షను వారు తిరస్కరిస్తున్నారని వివరించారు. పురుషాధిక్యతను ప్రశ్నించే గొంతుల తీవ్రత పెరిగిందని తెలిపారు. టీపీఎస్కే నాయకులు భూపతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆకాశంలో సగం మాత్రమే కాదు...అవకాశాల్లోనూ సగం కావాలనీ,, ఐక్య మహిళా పోరా టాలను బలోపేతం చేసుకుంటూ ప్రజలే రాజ్యాంగ రక్షకులుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మహిళలను కించపరిచే సోషల్ మీడియా యాప్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మహిళలు ప్రదర్శించిన డ్యాన్సులు, జానపద నృత్యాలు, పాడిన మహిళా చైతన్య గీతాలు ఆకర్షించాయి. ప్రజా పాటకు వీణా వాయిద్యం వాయించిన పద్మ సభికుల మన్ననలు పొందారు. ఈ కార్యక్రమంలో శైలజ మోహన్, కృష్ణ కుమారి, సుజావతి, శాస్త్రి, రమ, కొండల్ రావు తదితరులు పాల్గొన్నారు.