Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
నిరుద్యోగులు ధైర్యంగా ఉండాలనీ, ఆత్మహత్యలకు పాల్పడొద్దని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని నోటిఫికేషన్లు వేస్తామని చెప్పారు. శనివారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్లో ఆయన విలేకర్ల మాట్లాడారు. టీఎస ్పీఎస్సీ విజయాలను ప్రభుత్వ విజయాలుగా చెప్పుకున్నప్పుడు...టీఎస్పీఎస్సీలో జరిగిన తప్పులు ప్రభుత్వం తప్పులు కాదా? అని ప్రశ్నించారు. సిరిసిల్ల జిల్లాకు చెందిన నిరుద్యోగి నవీన్ ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహిం చాలని డిమాండ్ చేశారు. నవీన్ కుంటుంబ సభ్యులను ఎవరు కలవకుండా కేటీఆర్ మేనేజ్ చేశా రని విమర్శించారు. పేపర్ లీక్ కాకుండా ఉండేందుకు సాంకేతికత అంశాల ను కల్పించా ల్సిన బాధ్యత ఐటీ డిపార్టుమెంట్‌కు లేదా? అని ప్రశ్నించారు. బండి సంజరు అంటే ఎవరనే పరిస్థితి కరీంనగర్లో ఉందన్నారు. నవీన్ ఆత్మహత్యపై బీజేపీ వైఖరి ఏంటో చెప్పాలన్నారు.