Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎంకు ఉద్యోగ సంఘాల స్టేట్ జేఏసీ ధన్యవాదాలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సెర్ప్‌లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను ప్రభుత్వం క్రమబద్ధీ కరించింది. దీంతో గత 23 ఏండ్లుగా వారు కోరుకున్న కల సాకారమైంది. ఈ సందర్భంగా సెర్ప్ కాంట్రాక్ట్ ఉద్యోగుల స్టేట్ జేఏసీ నాయకులు కుంట గంగాధర్ రెడ్డి, నరసయ్య, సుదర్శన్, సుభాష్, జానయ్య, వెంకట్, సురేఖ సీఎం కేసీఆర్‌కు, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ కవితకు ధన్యవాదాలు తెలిపారు. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేయనున్నట్టు ప్రకటించారు. సెర్ప్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు జీవో విడుదల చేయడం పట్ల తెలంగాణ రాష్ట్ర జీవో నెంబర్ 16 కాంట్రాక్టు ఉద్యోగుల, లెక్చరర్ల క్రమబద్ధీకరణ సాధన సమితి రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో సెర్ప్‌లో పని చేస్తున్న 3,972 మంది ఉద్యోగులకు లబ్ది చేకూరనుంది. దీంతో రాష్ట్ర ఖజానాపై ఏడాదికి రూ.58 కోట్ల అదనపు భారం పడనున్నది.