Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భైరి ఇందిర కథకురాలిగా, విమర్శకురాలిగానే కాక తెలంగాణలో తొలి గజల్ కవయిత్రిగా గుర్తింపు తెచ్చుకున్నారనితెలంగాణ సాహితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఆనందాచారి అన్నారు. ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ చివరి వరకు సాహిత్యంతో మమేకమై జీవించారని ఆమెకు నివాళలర్పించారు. ఇందిర సాహితీ స్రవంతిలో, తెలంగాణ సాహితిలో కీలకపాత్ర పోషించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అద్భుతమైన కవయిత్రిని సాహితీ లోకం కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 19వ తేదీన కన్నుమూసిన ప్రముఖ కవయిత్రి భైరి ఇందిర సాహిత్య స్మరణ కార్యక్రమాన్ని తెలంగాణ సాహితి ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రముఖ రచయిత్రి ఇందిర స్నేహితురాలైన సమ్మెట ఉమాదేవి మాట్లాడుతూ నిక్కచ్చిగా, సూటితత్వంతో ఉన్నా అందరినీ స్నేహించే స్వభావం ఆమె సొంతం అని ఆమె పేరిట తెలుగు యూనివర్సిటీ, మిత్రులు, కుటుంబ సభ్యులు కలిసి భైరి ఇందిర గజల్ పురస్కారం ఒకటి ఏర్పాటు చేస్తే బాగుంటుందని అన్నారు. వీలునామా సంకలనం తీసుకురావడం ఆమె చివరి కోరికని, దాన్ని తెలంగాణ సాహితి ఆధ్వర్యంలో త్వరగా తీసుకొస్తే మంచిదని ప్రముఖ రచయిత్రి జ్వలిత అన్నారు. ఆమె రాసిన సాహిత్యాన్ని ఈ సందర్భంగా సాహిత్య కారులు గుర్తు చేసుకు న్నారు. భైరి ఇందిర కుమార్తె హిమజ తల్లి రాసిన గజల్ పాడి కన్నీటి పర్యాంతమయ్యారు. ఆమె కుమా రుడు రఘురాం తల్లి గురించి ఓ కవిత రాసుకొచ్చి సభలో వినిపించారు. ఈ సభకు తెలంగాణ సాహితి రాష్ట్ర సహాయకార్యదర్శి సలీమ అధ్యక్షత వహించగా నాయకులు రాంపల్లి రమేష్, తంగిరాల చక్రవర్తి, రూప రుక్మిణి, మెరెడ్డి రేఖ పాల్గొన్నారు.