Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశంలోనే ఉద్యోగులకు అత్యధిక వేతనాలిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలిపారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఉద్యోగులకు కొత్త పే స్కేల్ అమలుకు ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఆ ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుంట గంగాధర్‌రెడ్డి, ఇతర ప్రతినిధులు కవితను ఆదివారం హైదరాబాద్‌లో కలిసి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్రంలో నాటి పాలకులు సెర్ప్ ఉద్యోగుల డిమాండ్లను ఏనాడూ పట్టించుకోలేదన్నారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్, సెర్ప్ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించేందుకు నిర్ణయించి వారి జీవితాల్లో వెలుగులు నింపారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో 3,978 మంది ఉద్యోగులకు లబ్ది చేకూరుతుందని చెప్పారు. కాగా ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త పేస్కేల్ ప్రకారం జీతాలు చెల్లించనున్నారు.