Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కర్నాటక, యూపీ, గుజరాత్లో మంత్రులు రాజీనామా చేశారా? : బీజేపీపై మంత్రి గంగుల ఆగ్రహం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
యూపీపీఎస్సీకి సంబంధించి 2010లో ఒక ఐపీఎస్ అధికారి చేసిన తప్పుకు నాటి ప్రధాని రాజీనామా చేశారా? కర్నాటక, యూపీ, గుజరాత్ రాష్ట్రాల్లో పేపర్ లీకేజీలు జరిగినప్పుడు ఆయా రాష్ట్రాల మంత్రులు పదవులు వదులుకున్నారా? అని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ బీజేపీ నాయకులను ప్రశ్నించారు. ఆదివారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ,శాసన మండలి చీఫ్ విప్ టి.భానుప్రసాద్ ,ఎమ్మెల్సీ ఎల్.రమణ, బీఆర్ఎస్ కార్మిక విభాగం నేత రూప్సింగ్తో కలిసి గంగుల మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేస్తున్న పాదయాత్రను కనుమరుగు చేసేందుకు రేవంత్ రెడ్డి టీఎస్పీఎస్సీపై వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపారు. పేపర్ లీకేజీ ఘటనను తమ ప్రభుత్వమే బయటకు తెచ్చిందనీ, సిట్ వేసిందని గుర్తుచేశారు. ఆ వ్యవహారం స్కాం కాదనీ, ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పని తెలిపారు. నిందితుడు రాజశేఖర్ రెడ్డి గ్రామం, కేటీఆర్ పీఏ గ్రామం పక్కపక్కనే ఉంటే తప్పా? అని ప్రశ్నించారు. భానుప్రసాద్ మాట్లాడుతూ ఇద్దరు వ్యక్తులు తప్పు చేస్తే ఆ వ్యక్తులున్న జిల్లాల నాయకులు అందరూ తప్పు చేసినట్టా అని ప్రశ్నించారు. పేపర్ లీకేజీ అనేది హానీ ట్రాప్ వల్ల జరిగిన తప్పు అనేది స్పష్టంగా అర్థమవుతోందన్నారు.