Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సలహాదారులుగా ఎమ్డీ యూసుఫ్, ప్రధాన కార్యదర్శిగా యజ్జ సత్యనారాయణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గ్రామపంచాయతీ జేఏసీ చైర్మెన్‌గా పాలడుగు భాస్కర్(సీఐటీయూ), సలహాదారులుగా ఎమ్డీ యూసుఫ్ (ఏఐటీయూసీ), ప్రధాన కార్యదర్శిగా యజ్జ సత్యనారాయణ(బీఆర్ఎస్), కోశాధికారిగా సదానందం(బీఆర్ఎస్) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గ్రామపంచాయతీ యూనియన్లు, అసోసియేషన్ల సంయుక్త సమావేశం జరిగింది. గ్రామపంచాయతీ కార్మికులు, ఉద్యోగులు, కారోబార్ల సమస్యల పరిష్కారం కోసం జేఏసీ ఏర్పడింది. దశలవారీగా పోరాటాలు నిర్వహించాలని నిర్ణయించింది. అనంతరం జేఏసీ నూతన కమిటీని ఎన్నుకున్నారు. కన్వీనర్లుగా పి.అరుణ్‌కుమార్(ఐఎఫ్టీయూ), జయచంద్ర(ఏఐటీయూసీ), కో-కన్వీనర్లుగా చాగంటి వెంకటయ్య(సీఐటీయూ), వెంకటరాజ్యం(ఏఐటీయూసీ), ఆర్కేనాయుడు(బీఆర్ఎస్), మధుసూదన్‌రెడ్డి (ఐఎఫ్టీయూ), పి.శివబాబు(ఐఎఫ్టీయూ), జేఏసీ సభ్యులుగా జి.పాండు, గణపతిరెడ్డి, పాలడుగు సుధాకర్, పి.వినోద్‌కుమార్, పి.యాదమ్మ(సీఐటీయూ), వడ్డేబోయిన వెంకటేశం, సాదుల శ్రీకాంత్, అశోక్, యాదగిరి(బీఆర్ఎస్), పి.మలయ్య, యండీ యూసుఫ్, ఏ.రామచంద్రయ్య, బి.దాస్, ఉస్మాన్(ఏఐటీయూసీ), వెంకట్రాములు, కో-ఆప్షన్(ఐఎఫ్టీయూ), స్వామి, యాదయ్య(ఐఎఫ్టీయూ) ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా భాస్కర్, యూసుఫ్, సత్యనారాయణ మాట్లాడుతూ..గ్రామపంచాయతీలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు, వాటర్ వర్కర్స్, ఎలక్ట్రిషియన్లు, కారోబార్లు, బిల్కలెక్టర్లు ఐక్య ఉద్యమాలు చేయాలని నిర్ణయించామన్నారు.
జీవో నెంబర్ 60 ప్రకారం మున్సిపల్ సిబ్బందికి వేతనాలు చెల్లిస్తున్నట్టుగానే పంచాయతీ కార్మికులకూ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కారోబారు, బిల్కలెక్టర్లకు ప్రత్యేక హోదా కల్పించాలనీ, కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న వారిని పర్మినెంట్ చేయాలని కోరారు. భవిష్యత్తు కార్యాచరణ డిమాండ్ల రూపకల్పన కోసం ఈ నెల 31న స్టీరింగ్ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఏప్రిల్ 11న భారీ రాష్ట్ర సదస్సు నిర్వహించి ఆందోళన కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.