Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో ఈ నెల 23, 24 తేదీల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు ఆయా జిల్లాల్లో పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఎక్కువ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురువొచ్చని తెలిపింది. హైదరాబాద్లో వచ్చే మూడు రోజుల పాటు ఆకాశం పాక్షికంగా మేఘావృతమై సాయంత్రంపూట తేలికపాటి జల్లులు పడే అవకాశముంది. సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్లు ఎత్తులో దక్షిణ శ్రీలంక నుంచి తమిళనాడు, రాయలసీమ, తెలంగాణ మీదుగా ఈశాన్య మధ్యప్రదేశ్ వరకు ద్రోణి నెలకొంది.