Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏప్రిల్ 2వరకు ఆన్లైన్ పనులు బంద్ : సీఐటీయూ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఐకేపీ వీఓఏల సమస్యలను పరిష్కరించాలనీ డిమాండ్ చేస్తూ మంగళవారం నుంచి ఏప్రిల్ రెండో తేదీ వరకు ఆన్లైన్ సేవలను బంద్ చేస్తున్నట్టు ఐకేపీ వీఓఏ ఉద్యోగుల జేఏసీ ప్రకటించింది. ఈ మేరకు సెర్ప్ సీఈఓకు సమ్మె నోటీసును ఐకేపీ వీఓఏ ఉద్యోగుల సంఘం(సీఐటీయూ అనుబంధం) సమ్మె నోటీసును మంగళవారం అందజేసింది. ఈ మేరకు ఆ సంఘం గౌరవాధ్యక్షులు ఎస్వీ రమ, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.రాజ్‌కుమార్, ఎం.నగేశ్, కోశాధికారి సుమలత ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ఈ నెల 16 నుంచి 18 వరకు మూడు రోజుల పాటు టోకెన్ సమ్మె చేసినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం నుంచి ఏప్రిల్ రెండో తేదీ వరకు ఆన్లైన్ సేవలను బంద్ చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వీఓఏలను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి కనీసవేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామ సంఘం గ్రేడింగ్‌తో సంబంధం లేకుండా ప్రతినెలా వీఓఏల వ్యక్తి ఖాతాల్లో వేతనాలు వేయాలని కోరారు. వీఓఏలపై మహిళా సంఘాల ఒత్తిడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎస్హెచ్ఓలకు వీఎల్ఆర్, అభయహస్తం డబ్బులు చెల్లించాలని విన్నవించారు. ఎస్‌హెచ్‌జీ, వీఏ లైవ్ మీటింగ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన వీఓఏలకు సీసీలుగా ప్రమోషన్లు కల్పించాలనీ, రూ.10 లక్షల ఆరోగ్య, సాధారణ బీమా సౌకర్యాలను కల్పించాలని కోరారు.