Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రక్రియ వేగంగా పూర్తి చేయండి : మంత్రి హరీశ్ రావు
నవతెలంగామ బ్యూరో - హైదరాబాద్
బోధనాస్పత్రుల పరిధిలోని 1,442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామక ప్రక్రియను ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. వెరిఫికేషన్ సహా, ఇతర ప్రక్రియలు పూర్తయిన నేపథ్యంలో తుది ఫలితాలు విడుదల చేసేందుకు అవసరమైన చర్యలను సత్వరం చేపట్టాలని సూచించారు. పేదలకు వైద్య ఖర్చుల భారం లేకుండా చేసి, నాణ్యమైన వైద్యం అందేలా చూడాలన్నారు. మంగళవారం ఆరోగ్యశ్రీ పథకం అమలు, పురోగతిపై హరీశ్‌రావు నెలవారీ సమీక్ష నిర్వహించారు. డీఎంఇ, డీపీహెచ్, టీవీవీపీ పరిధిలోని ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద నిర్వహిస్తున్న చికిత్సలు, శస్త్రచికిత్సల సంఖ్య పెరుగుతుండటం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
2021-22తో పోల్చితే, 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి చివరి వరకు ఈ చికిత్సలు, శస్త్రచికిత్సల సంఖ్య డీఎంఈ పరిధిలో 72,225 నుంచి 1,08,223కు పెరగగా, టీవీవీపీలో 66,153 నుంచి 99,744కు పెరిగాయి. డీపీహెచ్ పరిధిలో కొత్తగా ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభం కావడం వల్ల 14,965 కేసులు నమోదు అయ్యాయి.