Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీవీవీ నేత శ్రీను నాయక్ హెచ్చరిక
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి ఈనెల 24,25 తేదీల్లో ఉస్మానియా యూనివర్సిటీలో తలపెట్టిన దీక్షను అడ్డుకుంటామని గిరిజన విద్యార్థి విభాగం నేత శ్రీను నాయక్ ఒక ప్రకటనలో హెచ్చరించారు.ఆయన నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతూ వారిని ప్రభుత్వం మీదకు ఉసిగొల్పుతున్నారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పేపర్ లీకుల అంశాన్ని రేవంత్ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.
రేవంత్ అవకాశవాది : ఎల్చల దత్తాత్రేయ
నిరుద్యోగులను వాడుకుని రాజకీయం చేస్తామనుకుంటే సహించేది లేదని ఎంబీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎల్చల దత్తాత్రేయ ఒక ప్రకటనలో హెచ్చరించారు. రేవంత్‌రెడ్డి అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు బినామీగా రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన రేవంత్...ఏ మొహం పెట్టుకుని ఓయూకు వస్తున్నారని ప్రశ్నించారు.