Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గవర్నర్కు మంత్రి సత్యవతి రాథోడ్ లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నిరుద్యోగ యువతకు సంబంధించిన కొలువుల బిల్లులపై వెంటనే సంతకం చేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ గవర్నర్ తమిళిసైకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం గవర్నర్కు మంత్రి లేఖ రాశారు. సోమవారం రాజ్ భవన్లో జరిపిన ఉగాది ఉత్సవాల్లో రాష్ట్ర యువతకు దక్కాల్సిన అవకాశాల గురించి ప్రస్తావిస్తూ కొన్ని వ్యాఖ్యలను చేశారని గుర్తుచేశారు. తెలంగాణ యువత కేంద్ర ప్రభుత్వ వైఖరి, వివక్ష వల్లనే తమకు అనేక సమస్యలు ఎదురవుతున్నాయని బలంగా నమ్ముతున్నారని తెలిపారు. గవర్నర్ హౌదాలో తెలంగాణ యువకుల ఉపాధి అవకాశాలను అడ్డుకునేలా బిల్లులను తొక్కి పెడుతున్న విషయాన్ని యువత గుర్తుపెట్టుకున్నదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తున్న అనేక అన్యాయాల గుర్తుంచుకుంటున్నారని పేర్కొన్నారు.