Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వనమూలికా వైద్యసేవలు ప్రశంసనీయం
- హోంమంత్రి మహమూద్ అలీ
నవతెలంగాణ - హైదరాబాద్
ఆయుర్వేద డాక్టర్ జమాల్‌ఖాన్ ఔషధ వనమూలికల వైద్య సేవలను రాష్ట్ర హోంశాఖా మంత్రి మహ్మద్ మహమూద్ అలీ ప్రశంసిం చారు. మంగళవారం డాక్టర్ జమాల్ ఖాన్‌ను హైదరా బాద్‌లోని తన నివాసానికి ఆహ్వానించారు. ఆయన వైద్య సేవలను కొని యాడుతూ శాలువా కప్పి ఘనంగా సత్క రించారు. ఈ సందర్భంగా డాక్టర్‌తో హోం మంత్రి మాట్లాడుతూ వనమూ లిక వైద్యం ఎంతో విశిష్టతతో కూడుకున్నదన్నారు. పురాతన కాలం నుంచి మానవాళికి ఉపయోగపడే ఆయుర్వేద వైద్య విధానం గూర్చి ప్రజలకు అవగా హన కలిగించాలని అభిప్రాయ పడ్డారు. గ్లోబల్ వార్మింగ్ రోజు రోజుకు వాతావరణం వేడెక్కి భూమిపై జీవరాశి మనుగడకే సవాల్‌గా మారిందన్నారు. మనిషి స్వార్ధానికి అడవులను విచక్షణారహితంగా నరికి వేయడంతో ఎంతో విలువైన ఔషధ మొక్కలు అంతరించి పోతున్నాయని చెప్పారు. మానవ మనుగడకు అవసరమయ్యే వనమూలికా ఔషధ మొక్క లు నాటి ప్రజలలో చైతన్యం తీసుకువచ్చి భావితరాలకు ప్రాణ వాయు వును అందించాలన్నారు. ఇందుకు డాక్టర్ జామాల్ఖాన్ స్పందిస్తూ ప్రస్తుత పరిస్థితుల్లో వనమూలికల కొరత ఎక్కువగా ఉంటున్నదని అన్నారు. తెలంగాణ ముస్లిం ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ మాట్లాడుతూ విష సర్పాల బారినపడి మత్యువుకు చేరువవుతున్న దశలో వేలాది మందిని పాము కాటు బాధి తులను ఉచితంగా మందులను అందించారని చెప్పారు. మంత్రిని కలిసిన వారిలో భద్రాచలం బీఆర్ఎస్ పార్టీ మాజీ నియోజకవర్గ ఇన్ఛార్జీ మానే రామకష్ణ, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి, సీనియర్ జర్నలిస్ట్ కర్ర అనిల్‌రెడ్డి. ఎస్కే షాజహాన్ తదితరులు పాల్గొన్నారు.