Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రముఖ దర్శకుడు వి.ఎన్.ఆదిత్య
నవతెలంగాణ-కల్చరల్
పెద్ద సినిమాలు ఎక్కువగా లాభ నష్టాలు.. వ్యాపారాత్మక కోణం ప్రాధాన్యతగా ఉంటాయని, ఈ సమయంలో సామాజిక చైతన్యానికి లఘు చిత్రాల అవసరం ఎంతో ఉందని ప్రముఖ దర్శకుడు వి.ఎన్.ఆదిత్య అన్నారు. భగత్‌సింగ్ వర్ధంతి సందర్భంగా ఆయన స్మరణలో రవీంద్రభారతిలోని పైడి జయరాజ్ ప్రీవ్యూ థియేటర్లో భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నిర్వహణలో మంగళవారం లఘు చిత్ర పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినిమా మాధ్యమం సమాజాన్ని ప్రభావితం చేస్తుందన్నారు. భగత్ సింగ్ త్యాగ నిరతి దేశభక్తిని నేటి తరానికి స్ఫూర్తి కలిగించేందుకు చిన్న బడ్జెట్లో లఘు చిత్రాలు తీయాలని సూచించారు. డైరెక్టర్ ప్రేమ్‌రాజ్ మాట్లాడుతూ.. చిన్న చిత్రాల ద్వారా గొప్ప సందేశం అందించాలని, నేటి లఘు చిత్ర దర్శకులు, నటులే రేపటి పెద్ద చిత్రాలకు ఎదుగుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, నటుడు బి.డి.ఎల్.సత్యనారాయణ, డివైఎఫ్ఐ హైదరాబాద్ కార్యదర్శి జావేద్, ఎస్ఎఫ్ఐ అధ్యక్ష కార్యదర్సులు అశోక్ రెడ్డి లెనిన్, నాయకులు స్టాలిన్, సాయి, విజయ కుమార్, శ్రీనివాస్, జె కె. శ్రీనివాస్ అజరు బాబు కిరణ్, వీరయ్య జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.