Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇష్టాగోష్టిలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీపై సమగ్ర విచారణ జరిపించాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. సిట్ ద్వారా ఈ వ్యవహరం పూర్తిగా బయటపడబోదంటూ అనుమానం వ్యక్తం చేశారు. సిట్ అంటే సిట్, స్టాండ్ మాత్రమేనని ఎద్దేవా చేశారు. గతంలో సిట్ విచారించిన కేసులన్నీ ఎక్కడపోయాయని ప్రశ్నిం చారు. డ్రగ్స్, నయీమ్ ల్యాండ్, గోల్డ్ స్టోన్ ప్రసాద్, హౌసింగ్ బోర్డు, ఎమ్మెల్యే కొనుగోలు అంశంపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు. మంగళవారం అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయంలో ఇష్టాగోష్టిగా విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు భర్తీ చేసిన ఉద్యోగాల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరారు. ఇదే అంశంపై హైకోర్టులో గంట సేపు వాదనలు జరిగాయని వివరించారు. ఇప్పటి వరకు సిట్ విచారించిన విషయాలు తమకు కూడా తెలపాలని కోరినట్టు వివరించారు. సిట్ రిపోర్ట్‌ను కోర్టుకు అందజేయడంతోపాటు తమకూ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పేపర్ లీకేజ్ విషయం ప్రవీణ్, రాజశేఖర్‌కే పరిమితం కాలేదన్నారు. చైర్మెన్, సెక్రెటరీలు, శంకర్ లక్ష్మిని బాధ్యులుగా చేర్చాల న్నారు. టీఎస్పీఎస్సీలో ఉన్న సిస్టమ్‌కు బాధ్యత ఐటీ శాఖదేనన్నారు. ఈ క్రమంలో పిరియాడికల్ అడిట్ చేయాలని సూచిం చారు. చిరు ఉద్యోగులతో కేసును మూసే కుట్ర జరుగుతున్నదని చెప్పారు. న్నారు. మంత్రి కేటీఆర్ తెలివిగా నా పరిధిలోకి రాదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. టీఎస్పీఎస్సీ తాళాల గుత్తిని ఆంధ్రోడి చేతిలోనే పెట్టారనీ, సిట్ విచారణ అధికారి ఏఆర్ శ్రీనివాస్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తేననిన్నారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల విచారణ సమగ్ర చేయాలంటూ కోరిన కారణంగానే, తనకు నోటీసులిచ్చారని తెలిపారు.