Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎకరాకు రు.20వేల ష్టపరిహారమివ్వాలి : సీపీఐ(ఎం) మాజీ ఎమ్మెల్యే జూలకంటి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలకు నష్టపోయి న రైతాంగాన్ని ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు, సీపీఐ(ఎం) మిర్యాలగూడెం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లక్షల ఎకరాల్లో ధాన్యం, మామిడి, మొక్కజొన్న, జొన్న, పసుపు, పొద్దుతిరుగుడు, కూరగాయలు తదితర పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. దీంతో రైతులు అప్పులు తెచ్చి పంటలు పండిస్తే..కష్టమంతా నీళ్లపాలయిం దని రోదిస్తున్నారని పేర్కొన్నారు. పిడుగులు పడటంతో ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు. గొర్రెలు, మేకలు, కోళ్లు చనిపోయాయని పేర్కొన్నారు. తక్షణమే జరిగిన నష్టంపై ప్రభుత్వ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి అంచనాలు వేయాలని డిమాండ్ చేశారు. నష్టానికి సంబంధిం చిన వాస్తవ గణాంకాలను, పూర్తి వివరాలను సేకరించి, నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 2018 నుంచి నేటివరకు రూ.1,500 కోట్ల పంటల నష్టం వాటిల్లిందని తెలిపారు. 2020 నుంచి 2023 వరకు రూ.1,787కోట్లు 15వ ఫైనాన్స్ కమిషన్లో ప్రకటించినా నష్టపరిహారం నామమాత్రంగానే అందిం దని పేర్కొన్నారు. 2022 వానాకాలంలో అధిక వర్షాల వల్ల 11లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. జరిగిన నష్టంపై కేంద్రానికి లేఖ రాయాలని కోరారు. నష్టాన్ని అంచనా వేసి నష్టపోయిన రైతులకు ఎకరాకు రు.20వేల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.