Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హౌంమంత్రి మహమూద్ అలీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచనల మేరకు రాష్ట్రపతి నిలయాన్ని ప్రజల సందర్శన కోసం వీలు కల్పిస్తూ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ తమిలిసై సౌందర రాజన్, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, రాష్ట్ర హౌం మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ పాల్గొన్నారు. హైదరాబాదులోని రాష్ట్రపతి నిలయంలో బుధవారం నాడు జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన గా హైదరాబాదులో జరిగిన కార్యక్రమంలో హౌం మంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా హౌం మంత్రి మాట్లాడుతూ.... భారత రాష్ట్రపతి హైదరాబాద్లోని రాష్ట్రపతి నిలయాన్ని ఏడాది పొడవునా సాధారణ ప్రజలు సందర్శించేందుకు వీలు కల్పించే ఈ గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నానన్నారు. ఉగాది శుభదినమనీ, తెలు గు ప్రజలకు నూతన సంవత్సరం ప్రారంభం రోజున భారత రాష్ట్రపతి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.