Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
టీఎస్పీఎస్సీ లీకేజీ అంశం చాలా చిన్నదంటూ వ్యాఖ్యానించినరాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి క్షమాపణ చెప్పాలని తెలంగాణ జన సమితి (టీజేఎస్) విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు సర్దార్ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తన సొంత నియోజకవర్గం నిర్మల్ జిల్లా కేంద్రంలో గల మున్సిపాలిటీలో 42 ప్రభుత్వ ఉద్యోగాలను సైతం అర్హులకు ఇవ్వకుండా అమ్ముకున్న చరిత్ర మంత్రిదని ఆరోపించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ మెప్పు కోసం తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగులకు అవమానిస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పాలనీ, నిరుద్యోగుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.