Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లేకపోతే ఆమరణ నిరాహారదీక్ష : అభ్యర్థులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
టీఎస్పీఎస్సీ నిర్వహించిన సీడీపీఓ, ఇవో పరీక్షలను రద్దు చేయాలని పలువురు అభ్యర్థులు డిమాండ్ చేశారు. లేకపోతే ఆమరణ నిరాహారదీక్ష చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాంకు అభ్యర్థులు స్వప్న, రాజమణి, నవ్య, ఎస్తేర్ తదితరులు వినతిపత్రం సమర్పించారు. తాము చేసే పోరాటానికి సహకరించాలని కోరారు. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసులో నిందితునిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి తల్లి ఐసీడీఎస్ లో వర్కర్‌గా పని చేస్తుండటం, అతని గ్రామ శివారు ముత్యంపేట గ్రామ పంచాయతీకి చెందిన ఐసీడీఎస్ వర్కర్ ఆర్.శోభారాణి ఇవో మెరిట్ లిస్ట్‌లో తొమ్మిదో స్థానంలో ఉండటం, అంగన్ వాడీ వర్కర్స్ లేదా వారితో సంబంధమున్న వారే మెరిట్ లిస్ట్‌లో ఉండి ఉద్యోగాలకు ఎంపిక కావటం ఆ పరీక్షల ప్రశ్నాపత్రాలు కూడా లీక్ అయ్యాయనే అనుమానాన్ని పెంచుతున్నాయని వారు పేర్కొన్నారు.