Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీయూసీ చైర్మెన్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మోడీ అంటేనే ఒక అమ్మకమని పీయూసీ చైర్మెన్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి తెలిపారు. మహారాష్ట్ర లోని నాందేడ్‌లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాకకోసం మరాఠీ సోదరులు ఎదురు చూస్తున్నారన్నా రు. కాందార్లో సభ ద్వారా తెలంగాణ మోడల్ ఆవిష్కృతమవుతుందని ఆయన పేర్కొన్నారు. ''అనితర సాధ్యమైన అభివృద్ధి, ప్రజా సంక్షేమమే తెలంగాణ మోడల్ అని,మోడీది అన్నం పెట్టిన వారికే సున్నం పెట్టే మోడల్ అని విమర్శించారు. మోడీది ఈడీయిజమనీ, బీజేపీ ఒక సెల్లర్ పార్టీ అనీ, కిసాన్ కిల్లర్ పార్టీ అని విమర్శించారు. బీఆర్ ఎస్ ది రాజనీతి. బీజేపీది దమన నీతన్నారు. మోడీ దిమ్మతిరిగేలా కాందార్ లోహ సభ విజయవంతం చేయాలని కోరారు.