Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సోషల్ మీడియా అరెస్టులపై మంత్రి కేటీఆర్ ట్వీట్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పరుష పదాలతో ట్వీట్లు చేసిన వారిని అరెస్టులు చేస్తున్నారనీ, తెలంగాణ రాష్ట్రంలో కూడా అలాగే చేయాలేమో... అంటూ మంత్రి కే తారకరామారావు ట్వీట్ చేశారు. తెలంగాణలో ఏకంగా ముఖ్యమంత్రి, మంత్రులను దుర్భాషలాడుతూ అవమానకరంగా మాట్లాడు తున్నా సహిస్తున్నామన్నారు. పరుష పదాలతో ట్వీట్ చేసినందుకు బీజేపీ పాలిత రాష్ట్రం కర్ణాటకలో కన్నడ నటుడు చేతన్‌ను అరెస్ట్ చేసిన విషయాన్ని ట్విట్టర్ వేదికగా ఆయన ప్రస్తావించారు. అక్కడిలాగే ఇక్కడా స్పందించాలే మో...ఏమంటారు? అంటూ ప్రజల్ని ఉద్దేశించి మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. భావ ప్రకటనా స్వేచ్ఛ... దూషించే స్వేచ్ఛ కాకూడదని ట్వీట్లో పేర్కొన్నారు.