Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఘటన స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ కిరణ్‌కుమార్
- అప్రమత్తమైన డిజాస్టర్ రెస్పాండ్ ఫోర్స్ టీం
నవతెలంగాణ-హసన్‌పర్తి
పండుగపూట నిరుపేద ఇంట్లో విషాదం నెలకొంది. ఈత కోసం వెళ్లిన ఇద్దరు పిల్లలు ఎస్సారెస్పీ కెనాల్లో గల్లంతయ్యారు. ఈ ఘటన కొత్తపల్లి గ్రామస్తులను శోకసంద్రంలో ముంచింది. హన్మకొండ ఏసీపీ కిరణ్‌కుమార్ ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేయూ ఎస్ఐ సతీష్, రాజుకుమార్‌తో పాటు డిజాస్టర్ రెస్పాండ్ ఫోర్స్ టీంను అప్రమత్తం చేసి గల్లంతైన పిల్లల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. కాకతీయ యూనివర్సిటీ పోలీసు స్టేషన్ పరిధి పలివేల్పుల శివారు గ్రామం కొత్తపల్లిలోని మట్టెడ నరేష్‌ది నిరుపేద కుటుంబం. నరేష్ ఇద్దరు కుమారులు మట్టెడ హర్షిత్(16), మట్టెడ అన్విక్(9) ఎస్సారెస్పీ పెద్ద కెనాల్లో బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఈతకు వెళ్లారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో పిల్లలు కొట్టుకుపోయారు. అక్కడే బట్టలు ఉతుకుతున్న చేతాళ్ల కేతమ్మ చూసి కేకలు వేసి ఒడ్డున ఉన్న అశోక్‌ని అప్రమత్తం చేసింది. పిల్లలను కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ విషయాన్ని స్థానికులు కేయూ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే కేయూ ఇన్స్పెక్టర్ దయాకర్ ఎస్ఐలు రాజుకుమార్, సతీష్‌తో పాటు డిజాస్టర్ రెస్పాండ్ ఫోర్స్ టీంను అప్రమత్తం చేసి ఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం హన్మకొండ కిరణ్ కుమార్‌యాదవ్ ఘటన స్థలాన్ని పరిశీలించి అగ్నిమాపక సిబ్బందిని, జీడబ్ల్యుఎంసీ డిసస్టర్ రెస్పాండ్ ఫోర్స్ టీమ్‌తో గాలింపు చర్యలు చేపట్టారు. మూడు బృందాలుగా ఏర్పడి నీటిలో దిగి గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ పిల్లల ఆచూకీ లభించలేదు. ప్రభుత్వ అన్ని శాఖల విభాగాల సమన్వయంతో గాలింపు చర్యలు చేపడుతున్నామని, సాధ్యమైనంత తొందరలో పిల్లల ఆచూకీ కనిపెడతామని ఏసీపీ కిరణ్‌కుమార్ తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు.