Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సహజ పానీయాలే తాగండి..
-9 జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కోయ వెంకటేశ్వరరావు
- జేవీవీ ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి పంపిణీ
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
నేటి తరానికి కూల్ డ్రింక్స్ రూపంలో పెను ముప్పు వచ్చి పడిందని, సహజ పానియాలే తాగాలని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కోయ వెంకటేశ్వరరావు అన్నారు. యువతీయువకులంతా వాటిని మానుకుని ప్రకృతి సిద్ధంగా తయారు చేసిన సహజ పానీయాలను తాగాలని సూచించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని జన విజ్ఞాన వేదిక హైదరాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో బుధవారం కృష్ణకాంత్ పార్కు మెయిన్ గేట్ వద్ద ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని వెంకటేశ్వరరావు ప్రారంభించి మాట్లాడారు. బహుళజాతి సంస్థలు కూల్ డ్రింక్స్ తయారు చేస్తూ, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయన్నారు. కూల్ డ్రింక్‌లో కలిపే సోడియం బెంజోయేట్ అనే ప్రిజర్వేటివ్ రసాయనం కణాల్లోని డీఎన్ఏపై ప్రభావం చూపడం వల్ల కణ వ్యవస్థకు నష్టం కలుగుతుందన్నారు. కూల్ డ్రింక్స్‌లో ఉండే యాసిడ్ ఎదలో మంటను కలిగిస్తుందన్నారు. అంతేకాదు అధిక రక్తపోటు వస్తుందని చెప్పారు. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి రాజా మాట్లాడుతూ.. నిత్యం కూల్ డ్రింక్స్ తాగే వాళ్లు అనారోగ్యం బారిన పడుతున్నారని చెప్పారు. ప్రముఖ రేడియాలజిస్ట్ డాక్టర్ భరత్ మాట్లాడుతూ. కూల్ డ్రింక్స్‌కు వ్యతిరేకంగా జేవీవీ అనేక పోరాటాలు చేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘ నాయకులు జి.నాగేశ్వరావు మాట్లాడుతూ.. మూఢనమ్మకాలను నియంత్రించేం దుకు ప్రభుత్వం ఒక చట్టం తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘ నాయకులు సింహాచలం, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు వేణుగోపాల్ రెడ్డి, జేవీవీ నగర నాయకులు చెన్నుపాటి చంద్రశేఖరరావు, జూబ్లీహిల్స్ జోన్ ప్రధాన కార్యదర్శి ఎం.రవీంద్రబాబు, అధ్యక్షులు పి.సుబ్బారావు, జితిన్ ప్రసాద్, పాపారావు, జి.సూర్యప్రకాష్‌రెడ్డి, వి.శ్రీనివాస్, ఎల్.సతీష్, ఆర్.అశోక్ తదితరులు పాల్గొన్నారు.జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో 'కూల్ డ్రింక్స్ వద్దు, సహజ పానీయాలు ముద్దు' నినాదంతో ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమాన్ని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కుషాయిగూడలో నిర్వహించారు. టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి సింగిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి, ట్రాఫిక్ ఎస్ఐ నాగేంద్రప్రసాద్, జేవీవీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.శ్రీనివాస్ పాల్గొ న్నారు. అలాగే, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రగతినగర్‌లో జేవీవీ మేడ్చల్ జిల్లా బాచుపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి పంపిణీని జేవీవీ రాష్ట్ర కోశాధికారి ప్రారంభించారు.