Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ పంచాంగ శ్రవణంలో హెచ్చరిక
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాజకీయంగా అధికారపార్టీకి వ్యతిరేకత ఉన్నదనీ, పాలించే 'రాజు' జాగ్రత్తగా ఉండాలని ఉగాది వేడుకల సంవర్భంగా నిర్వహించిన పంచాంగం శ్రవణంలో సిద్ధాంతి హెచ్చరిక చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో జరిగిన కార్య క్రమంలో శారదాపీఠం పండితులు బాచుపల్లి సంతోష్‌కుమార్ పంచాంగ శ్రవణం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నదని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శోభకత్ నామ సంవత్సర పంచాంగాన్ని ఆవిష్కరించారు. పలువురు ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈ ఏడాది రాష్ట్రప్రభుత్వం సుపరిపాలన అందిస్తుందనీ, పెండింగ్ బిల్లులన్నీ క్లియర్ అవుతాయని చెప్పుకొచ్చారు. పాలించే రాజుకు కొందరు వ్యక్తుల ద్వారా వ్యతిరేకత వస్తుందనీ, అందువల్ల ఆయన జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. వర్షాలు భారీగా పడతాయనీ, నాగార్జునసాగర్, శ్రీశైలం, కాళేశ్వరం ప్రాజెక్టులన్నీ నీటితో నిడుతాయని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో సమూల మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయనీ, విద్యాశాఖలో మరికొన్ని అవకతవకలు జరిగే ప్రమాదం ఉందని అభిప్రాయం వ్యక్తంచేశారు. న్యాయవ్యవస్థలో సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు ఇస్తాయని జోస్యం చెప్పారు. ప్రతిపక్షాలు ఉనికి కాపాడుకోవాలనీ, మత ఘర్షణలు, సామాజిక ఉద్రిక్తతలు జరిగే అవకాశం ఉందని చెప్పారు. ఉత్తర భారతంలో అగ్నిప్రమాదం జరిగే అవకాశం ఉందన్నారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరమైన సంఘటనలు జరగబోతున్నాయని వెల్లడించారు. ఈ మూడు మాసాల్లో విపరీతమైన ఒడిదుడుకులు జరగబోతున్నాయన్నారు. తెలంగాణ ప్రజలు ఆసక్తికరమైన రాజకీయాలను చూడబోతున్నారని తెలిపారు. ధరలు తగ్గుతాయనీ, ఏప్రిల్‌లో ఎండలు ఎక్కువవుతాయని చెప్పారు.
హైదరాబాద్ చేరుకున్న కవిత, మంత్రులు
ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్ చేరుకున్నారు. ప్రత్యేక చాపర్ విమానంలో ఢిల్లీ నుంచి ఆమెతో పాటు మంత్రులు కే తార కరామారావు, టీ హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అటునుంచి వారంతా నేరుగా ప్రగతిభవన్‌కు వెళ్లారు.