Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 28 శాతం జీఎస్టీతో ఈ రంగానికి ఉరే!
- కోట్పా సవరణలతో తీవ్ర ప్రమాదం
- కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపని కేంద్రం
- తెలంగాణలో 16 జిల్లాల్లో బీడీ కార్మికులు
- ఉమ్మడి నిజామాబాద్లో 3 లక్షల మంది
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
తెలంగాణలో లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న బీడీ రంగంపై కేంద్రం కఠినమైన ఆంక్షలు విధిస్తోంది. ఇప్పటికే పుర్రె గుర్తులు, జీఎస్టీతో కుదేలవుతున్న రంగంపై కోట్పా(సిగరేట్ అండ్ అధర్ టొబాకో ప్రొడక్ట్ ఆక్ట్) సవరణ బిల్లు ప్రతిపాదించింది. ఒకవేళ ఈ బిల్లు చట్టరూపం దాల్చితే బహిరంగ మార్కెట్లో బీడీ విక్రయాలపై కూడా ఆంక్షలు అమలు కానున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే ఈ రంగంపై ఆధారపడిన లక్షలాది మంది కార్మికులు రోడ్డునపడే పరిస్థితి నెలకొంది. ఒకప్పుడు బీడీలు చుట్టిన కార్మికులకు నెలకు 24 రోజులపాటు ఉపాధి లభించేది. ప్రస్తుతం నెలలో 10-12 రోజులు మాత్రమే ఉపాధి లభిస్తోంది. కోట్పా చట్ట సవరణ బిల్లు ఆమోదం పొందితే ఈ మాత్రమూ ఉపాధి లభించే పరిస్థితి ఉండదు. బీడీ రంగంపై ఆంక్షలకు సిద్ధమవుతున్న కేంద్ర సర్కారు.. ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మందికి ప్రత్యామ్నాయ ఉపాధి చూపడంలో ఆసక్తి కనబరచకపోవడం విచారకరం.
తెలంగాణలో 16 జిల్లాల్లోని 45 నియోజకవర్గాల్లో బీడీ కార్మికులున్నారు. ఈ నియోజకవర్గాల్లో ఎన్నికల్లో గెలు పోటములను శాసించే స్థితిలో కార్మికులు ఉండటం విశేషం. మొత్తంగా రాష్ట్రంలో సుమారు ఏడు లక్షల మంది కార్మికులు ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఈ కార్మికులు ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవు తున్నారు. నెలలో కనీసం 15 రోజులు కూడా ఉపాధి లభిం చడం గగనమైంది. ఇం దుకు కేంద్రంలోని మోడీ సర్కారు తీసుకొస్తున్న ఆంక్షలు ప్రధాన కారణం. బీడీ కట్టలపై పుర్రె గుర్తు, క్యాన్సర్ గుర్తుల సైజ్ను సర్కారు పెంచింది. అదే సమయంలో బీడీ రంగంపై 18 శాతంగా ఉన్న జీఎస్టీని 28 శాతానికి పెంచింది. పన్నుల భారం తీవ్రమ వడంతో యాజ మాన్యాలు ఉత్పత్తి తగ్గించాయి. ఫలితంగా ఆ ప్రభావం కార్మికుల ఉపాధిపై పడుతోంది.
సంక్షేమం గాలికి..
బీడీ కార్మికుల సంక్షేమాన్ని కేంద్ర సర్కారు గాలికొదిలింది. కార్మికులు చుట్టే వెయ్యి బీడీలకు కేంద్ర ప్రభు త్వానికి సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ కింద రూ.14.42 జమ అవుతున్నాయి. ఇందులో నుంచి 1 శాతం నిధులను కార్మికుల సంక్షే మానికి విని యోగించేది. బీడీ కార్మికుల పిల్ల లకు స్కాలర్షిప్, ఉన్నత చదు వులకు సాయం, సమీకృత ఇండ్ల నిర్మాణం తదితర అవసరాలకు ఖర్చు చేసేది. కానీ కేంద్ర సర్కారు కార్మిక చట్టా లను కుదించి లేబర్ కోడ్లు తీసుకొచ్చిన తరు వాత ఈ సంక్షేమ పథకాలేవీ అమలయ్యే పరిస్థితి లేదు.
వేతన సవరణకు నోచుకోవట్లే..
రాష్ట్రంలో ఏడు లక్షల మంది కార్మికులు ప్రత్యక్షంగా బీడీ రంగంపై ఆధారపడగా.. బీడీలకు అవసరమయ్యే ఆకు సేకరణలో సుమారు 5 లక్షల మంది గిరిజనులు పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక యంత్రాల అవసరం లేకుండా కేవలం కార్మికుల రెక్కల కష్టంపై బీడీలు తయారు అవుతున్నాయి. కానీ కార్మికులకు కనీస వేతనాలు అమలు కావడం లేదు. 2011 ఫిబ్రవరి 3న కనీస వేతనాల జీఓ 81 వచ్చింది. కానీ దీన్ని అమలు చేయకుండా పక్కన పెట్టారు.
వేతనాల్లో సవరణలు చేసి మళ్లీ జీఓ నెం.41 తీసుకొచ్చారు. ఈ జీఓ కూడా అమలు చేయలేదు. అమలు చేయకుండానే కాలపరిమితి పూర్తయిన పరిస్థితి నెలకొంది. ఈ కార్మికులు ప్రధానంగా చేతినిండా పని కావాలనే డిమాండ్ చేస్తున్నారు.
ఆంక్షలు ఎత్తివేయాలి
బీడీ రంగంపై కేంద్ర సర్కారు అమలు చేస్తున్న ఆంక్షలను తక్షణమే ఎత్తివేయాలి. కనీస వేతన జీఓ జారీ చేయాలి. నెలకు 26 రోజులపాటు కార్మికులకు పని కల్పిం చాలి. కనీస పింఛన్ రూ.10 వేలు ఇవ్వాలి. అన్ని కేటగిరీల కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి. చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలి. కార్మికులకు ప్రత్యా మ్నాయ ఉపాధి చూపకుండా కోట్పా చట్ట సవరణలు చేయొద్దు.
ఎస్.రమ - సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి