Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై తాజా పరిస్థితితో కూడిన నివేదికను 48 గంటల్లో సమర్పించాలని సీఎస్ శాంతికుమారితో పాటు డీజీపీ, టీఎస్ పీఎస్సీ చైర్మెన్‌ను రాజ్‌భవన్ కోరింది. గవర్నర్ ఆదేశాల మేరకు రాజ్‌భవన్ కార్యాలయం గురువారం వారికి లేఖలు పంపించింది. నివేదికలో సిట్ విచారణ తాజా పరిస్థితి, అనుమతి తీసుకుని లేదా అనుమతి లేకుండా పరీక్షలు రాసిన టీఎస్పీఎస్సీ రెగ్యులర్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వివరాలు, పరీక్షల్లో వారికొచ్చిన మార్కులు, సిద్ధపడేందుకు తీసుకున్న సెలవులు తదితర వివరాలను కూడా సమర్పించాలని రాజ్‌భవన్ ఆ లేఖలో పేర్కొంది.