Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతిపక్షాలకు మండలి చైర్మెన్ గుత్తా ప్రశ్న
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పేపర్ లీక్ అంశానికి రాజకీయ రంగుపులమడం సరైందికాదని శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి చెప్పారు. ఐటీ మంత్రి ప్రతి కంప్యూటర్ను చెక్ చేస్తారా? అని ప్రశ్నించారు. గురువారం శాసనమండలిలోని తన చాంబర్లో ఆయన విలేకర్లతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. కొత్త ఏడాదిలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. వ్యక్తి తప్పు చేస్తే...దాన్ని వ్యవస్థకు అపాదించడం సరైంది కాదన్నారు. ఆర్డీవోగా విధులను ప్రారంభించిన టీఎస్పీఎస్సీ చైర్మెన్ జనార్దన్‌రెడ్డి కీలక శాఖల్లోనూ సిన్సియర్‌గా పని చేశారని తెలిపారు. పారదర్శకంగా పరీక్షలు ఉండాలనే ఉద్దేశంతో గ్రూప్-1లో ఇంటర్వ్యూలను రద్దు చేశారని గుర్తు చేశారు. ప్రతిపక్ష నేతలను దర్యాప్తులో భాగంగానే సీట్ ప్రతిపక్ష నేతలను సాక్ష్యాలు అడుగుతోందని అన్నారు. అది క్రిమినల్ నోటీసు కాదని చెప్పారు. అధికారులకు ప్రాంతీయ వాదాన్ని అపాదించడమేంటని ప్రశ్నించారు. పేపర్ లీకుల విషయంలో ప్రభుత్వ చిత్త శుద్దిని ఎవరు శంకించాల్సిన అవసరం లేదన్నారు. సిట్ విచారణతో వాస్తవాలు బయటకొస్తాయని చెప్పారు. ఆ తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ బిల్లులను ఇన్ని రోజులుగా గతంలో ఏ గవర్నర్ ఆపలేదని గుర్తు చేశారు. అందులో అభ్యంతరాలుంటే ప్రభుత్వానికి సూచించవచ్చ తెలిపారు. ఆ అనుమానాలను ప్రభుత్వం నివృత్తి చేస్తుందన్నారు. ఒక్క బిల్లును ఆమోదించి,మిగతా బిల్లును పెండింగ్‌లో ఉంచడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. వాటిని ఆమోదించకపోతే శాసనసభ, శాసన మండలిని అవమానించినట్టేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా గవర్నర్ బిల్లులకు ఆమోదం తెలిపాలని కోరారు.