Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బండికి మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రశ్న
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
బీజేపీ అధికారంలోకి వచ్చిన పదేండ్ల కాలంలో పంట నష్టానికి పైసా సాయమైన చేసిందా? బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ చెప్పాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఒక ప్రకటనలో ప్రశ్నించారు. ప్రధాని మోడీ రైతులకు అన్యాయం చేస్తే, సీఎం కేసీఆర్ వారికి న్యాయం చేశారని తెలిపారు. రైతుల కోసం రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్రం నుంచి పైసా తీసుకొచ్చారా? అని ప్రశ్నించారు. బండి సంజరు అవగాహనతో మాట్లాడాలని సూచించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఫసల్ భీమా పథకాన్ని అమలు చేయడంలేదన్నారు. ఈ పథకం మూలంగా బీమా కంపెనీలు మాత్రమే లబ్దిపొందుతున్నాయని పార్లమెంటులో సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వమే చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. దేశంలో ఎకరానికి రూ.10 వేల సహాయ, పునరావాసం ఇచ్చిన ఏకైక రాష్ట్ర తెలంగాణ అని పేర్కొన్నారు. బండి సంజరు కేంద్రంతో శాటిలైట్ ద్వారా, గూగుల్ మ్యాప్ ద్వారా సర్వే చేయించి తెలంగాణలో ఎంత పంట నష్టం జరిగిందో లెక్క తీసి కేంద్ర ప్రభుత్వ సాయం తీసుకురావాలని డిమాండ్ చేశారు.