Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.429.28 కోట్లతో రెండు లైన్లు, నాలుగు లైన్ల రహదారులు : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
తెలంగాణలోని బోధన్ నుండి మహారాష్ట్రలోని మద్నూర్ వరకు రెండు లైన్లు, నాలుగు లైన్ల రహదారుల విస్తరణకు రూ.429.28 కోట్ల వ్యయానికి ఆమోదం తెలిపినట్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితీన్ గడ్కరీ తెలిపారు. ఈ మేరకు గురువారం కేంద్ర మంత్రి ప్రకటన చేశారు.
తెలంగాణలోని కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలు, మహారాష్ట్ర నాందేడ్‌లోని ఎన్‌హెచ్-161 బిబిలోని మద్నూర్ నుండి బోధన్ సెక్షన్ వరకు రెండు లైన్ల రహదారి, నాలుగు లైన్ల రహదారిగా విస్తరించడానికి ఆమోదించినట్లు తెలిపారు. 39.032 కిలో మీటర్ల పొడవు గల ఈ ప్రాజెక్టును ఇంజనీరింగ్, సేకరణ, నిర్మాణం(ఈపిసి) పద్ధతిలో 2022-23 వార్షిక ప్రణాళిక కింద అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఎన్‌హెచ్-163జి (ఖమ్మం-విజయవాడ)లో రేమిడిచెర్ల గ్రామం నుండి జక్కంపూడి గ్రామం (ఎన్‌హెచ్-16లో) వరకు నాలుగు లైన్ల యాక్స్‌స్ కంట్రోల్డ్ గ్రీన్‌ఫీల్డ్ హైవే సెక్షన్‌ను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. 29.709 కిలో మీటర్ల లే అవుట్‌కు రూ.1,190.86 కోట్లు ఖర్చు అవుతుందని, ఇతర ఎకనామిక్ కారిడార్ (ఎన్‌హెచ్(ఒ)) ప్రోగ్రామ్‌ల కింద హైబ్రిడ్ యాన్యుటీ మోడ్‌లో వరుసగా తెలంగాణలోని ఖమ్మం, ఆంధ్రపద్రేశ్‌లోని ఎన్టిఆర్ జిల్లాలలో నిర్మిస్తామని తెలిపారు.