Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిరసనగా కాంగ్రెస్ మౌన దీక్ష
- బీజేపీ కుట్రలకు భయపడేది లేదు : మహేష్‌కుమార్‌గౌడ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీపై బీజేపీ కక్షసాధింపు చర్యలకు నిరసనగా కాంగ్రెస్ మౌనదీక్ష చేపట్టింది. రాహుల్‌కు రెండేండ్ల జైలు శిక్షను సురత్ కోర్టు విధించడాన్ని నిరసిస్తూ...గురువారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పార్టీ నాయకులు మౌన దీక్షను చేపట్టారు. కార్యక్రమ ముగింపు సందర్భంగా టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నదని విమర్శించారు. దేశంలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులను అణచివేసేందుకు ఆ పార్టీ కుట్రలు చేస్తున్నదనీ, వాటిని తిప్పికొడతామని చెప్పారు. ఎన్నికల సభల్లో మోడీపై విమర్శలు చేస్తే పరువు నష్టం దావా కేసు వేసి కక్ష సాధింపు చర్యలకు పాల్పతున్నారని విమర్శించారు. బీజేపీ బెదిరింపులకు రాహుల్‌గాంధీగానీ,కాంగ్రెస్ పార్టీగానీ భయపడబోదని స్పష్టం చేశారు. దేశ ప్రజలు రాహుల్ వెంటే ఉన్నారనీ, భారత్ జోడోతో మోడీ బెంబేలెత్తిపోతున్నారని చెప్పారు. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణలో కారు, కమలం డ్రామాలాడుతున్నాయని చెప్పారు. మాజీ ఎంపీ వి హనుమంతరావు మాట్లాడుతూ బీజేపీ నేతలకు ఇప్పుడు రాముడి కంటే మోడీయే ఎక్కువైపోయారని ఎద్దేవా చేశారు.ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి నదీమ్ జావిద్, పార్టీ నేతలు పొన్నాల లక్ష్మయ్య, మల్లు రవి, నిరంజన్, వినోద్‌రెడ్డి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, రోహిన్‌రెడ్డి, అనుబంధ సంఘాల చైర్మెన్లు వెంకట్, శివసేనారెడ్డి, సునీతరావు, మెట్టుసాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.