Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు శుభాకాంక్షలు తెలిపారు. నిష్టతో పాటించే ఉపవాస దీక్షలు, ప్రార్థనలు శాంతి, సామరస్యానికి వేదికలని ఆకాంక్షించారు. తెలంగాణకే తల మానికమైన '' గంగా జమునా తెహజీబ్ '' సంస్కృతిగా పరిఢవిల్లాలని కోరారు. ప్రభుత్వం ముస్లిమ్ల కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నదని తెలిపారు. మైనార్టీల సంక్షేమానికి 2008 నుంచి 2014 మద్యకాలంలో రూ.812 కోట్లు ఖర్చు చేస్తే, గత ఎనిమిదేండ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం రంజాన్ వేడుకలను అధికారికంగా నిర్వహిస్తూ ప్రతి ఏటా రాష్ట్రంలోని దాదాపు ఐదు లక్షల మంది ముస్లింలకు దుస్తులను, రంజాన్ కానుకలను పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు.