Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారీగా పార్టీ శ్రేణులు తరలి రావాలి : టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్
నవతెలంగాణ-హైదరాబాద్
తెలుగుదేశం 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈనెల 29న హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగే సభకు పార్టీ శ్రేణులు భారీగా తరలి రావాలని తెలుగుదేశం తెలంగాణ శాఖ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ పిలుపునిచ్చారు. ఈ సభకు తెలంగాణ నలుమూలల నుంచే కాక ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పెద్ద ఎత్తున నాయకులు హాజరవు తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో 28న ఎన్టీఆర ్భవన్‌లో టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం నిర్వహి స్తున్నట్టు తెలిపారు. గురువారం ఎన్టీఆర్ భవన్లో హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కా జి గిరి పార్లమెంటుకు చెందిన ముఖ్యనాయకులతో కాసాని భేటి అయ్యారు. పార్టీ ఆవిర్భావ సభకు జన సమీకరణ, ఇతర సన్నాహాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహించనున్న ఆవిర్భావ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సూచించారు. అనంతరం కాసాని జ్ఞానేశ్వర్ మాట్లా డుతూ రాష్ట్రంలో టీడీపీకీ పూర్వ వైభవం తేవడానికి పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ సభ తరలిరావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 93 నియోజక వర్గాలలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమం నిర్వహిస్తు న్నామని చెప్పారు. పొలిట్ బ్యూరోసభ్యులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ దేశం, ప్రజలతోపాటు సమాజానికి టీడీపీ చేసిన అభివద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ సందర్భంగా మరోసారి గుర్తు చేద్దామని అన్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర పార్టీ కో-ఆర్డినేటర్ కంభంపాటి రామ్మోహన్రావు మాట్లా డుతూ టీడీపీ ఆవిర్భావ దినోత్సవ సభను హైదరా బాద్‌లో నిర్వహించాలని జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు సూచించారని అన్నారు. ఈ సభ చాలా ప్రాముఖ్యత కలిగిన సభ అని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఉంది అన్న వారికి ఖమ్మం సభ ద్వారా నిరూపించామని అన్నారు. ఈ కార్య క్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధులు నన్నూరి నర్సిరెడ్డి, ప్రేమకుమార్ జైన్, తిరునగరి జ్యోత్న్స, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన, ఆ పార్టీ నాయకులు సామా భూపాల్ రెడ్డి, అలీ మస్కతి, రాష్ట్ర మీడియా కో-ఆర్డినేటర్ బియ్యని సురేష్, అజ్మీర రాజునాయక్, జీవీజీ నాయుడు, షేక్ ఆరీఫ్, పి.సాయిబాబా, సుభాష్ యాదవ్, శ్రీపతి సతీష్, పొగాకు జయరాం, హరికష్ణ, పి. అశోక్, బోస్ తదితరులు పాల్గొన్నారు. ఏపీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో తమ అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలిచిన నేపథ్యంలో ఎన్టీఆర్భవన్లో స్వీట్లు పంచారు.