Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నవీపేట్
ఆర్థిక ఇబ్బందులతో వీఆర్ఏ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలోని ఆశాజ్యోతి కాలనీలో గురువారం జరిగింది. ఇందుకు సంబంధించి ఎస్ఐ రాజారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. చెట్టుమీది క్రాంతి కుమార్(28) ఏడు సంవత్సరాలుగా బినోల వీఆర్ఏగా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే, కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు, జీతాలు సకాలంలో రాకపోవడంతో సతమతమవుతున్నాడు. ఈ క్రమంలో భార్య ఇంటి నుంచి వెళ్లిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన గంగాధర్ పురుగుల మందు తాగాడు. జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి గురువారం మృతిచెందాడు. మృతుని తల్లి లక్ష్మీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.