Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వివిధ రూపాల్లో దేశవ్యాప్తంగా కార్యక్రమాలు
- యూనివర్సిటీలు, కాలేజీల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు: కార్యాచరణ ప్రకటించిన కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించడానికి వీలుగా మహిళా బిల్లును తీసుకురావాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.ఈ మేరకు ఉద్యమాన్ని ఉధృతం చేయనున్నట్టు ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అంశంపై దేశవ్యాప్తంగా వివిధ రూపాల్లో కార్యక్రమాలు చేపట్టనున్నారు. మిస్డ్ కాల్ కార్యక్రమాన్ని మొదలుపెట్టడంతోపాటు దేశంలో యూనివర్సిటీలు, కాలేజీల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు, చర్చగోష్టులు నిర్వహించనున్నారు. వచ్చే నెలలో ఈ కార్యక్రమాలు నిర్వహించేలా ఆమె ప్రణాళిక రూపొందించారు. మహిళా బిల్లుకు మద్దతు కోసం దేశంలోని ప్రముఖ విద్యావేత్తలు, ప్రొఫెసర్లు, ఆలోచనపరులు, మేధావులకు కవిత పోస్టు కార్డులు రాయనున్నారు. మహిళా బిల్లు ఉద్యమాన్ని విస్తరించడంలో భాగంగా ఆమె శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో పోస్టర్ ను విడుదల చేశారు. ''మహిళలకు సాధికారత కల్పిద్దాం, దేశానికి సాధికారత కల్పిద్దాం. మహిళల రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వండి...మహిళా రిజర్వేషన్ బిల్లు ఎందుకు ప్రాధాన్యం కాకూడదు'' అని పోస్టర్ లో పేర్కొన్నారు.