Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాహుల్‌గాంధీపై అనర్హత వేటు కేంద్ర ప్రభుత్వ దుశ్చర్యకు పరాకాష్ట అని లోక్‌సభలో బీఆర్ఎస్ పక్షనేత నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. శుక్రవారం ఈమేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అక్రమాలను ప్రశ్నిస్తారనే భయంతోనే రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేశారని విమర్శించారు. కేంద్రం ప్రజాస్వా మ్యానికి, రాజ్యాంగ విలువలకు తిలో దాకాలిచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ చరిత్రలో నేడు చీకటి రోజుగా ఆయన అభివర్ణించారు. దర్యాప్తు సంస్థల అండతో ప్రతిపక్షాల గొంతు నొక్కు తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ సాక్షిగా ప్రజాస్వా మ్యం ఖూనీ చేసేలా కేంద్రం చర్యలున్నాయని తెలి పారు. బీజేపీ దుర్మార్గాలను ప్రజలు గమనిస్తు న్నారనీ, దేశ ప్రజలు బీజేపీ ప్రభుత్వా నికి తప్పక తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.