Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షల్లో భాగంగా కరీంనగర్లో ఇద్దరు, సంగారెడ్డిలో ఐదుగురు చొప్పున మొత్తం ఏడుగురిపై మాల్‌ప్రాక్టీస్ కింద కేసులు నమోదు చేశామని ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం మ్యాథమెటిక్స్ పేపర్-2బి, జువాలజీ పేపర్-2, హిస్టరీ పేపర్-2 సబ్జెక్టులకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు రాశారని పేర్కొన్నారు. ఈ పరీక్షకు 3,41,013 మంది దరఖాస్తు చేసుకున్నారనీ, వారిలో 3,30,920 (97.1 శాతం) మంది విద్యార్థులు హాజరయ్యారని వివరించారు. 10,093 (2.9 శాతం) మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. ఈ పరీక్షల కోసం ఏ సెట్ ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేశామని వివరించారు. మహబూబ్‌నగర్, సంగారెడ్డి, నిజామాబాద్, కామారెడ్డి, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల్లో ఇంటర్ బోర్డు పరిశీలకులు పర్యటించి పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారని తెలిపారు.