Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాత పెన్షన్ను పునరుద్ధరించకుంటే బీజేపీకి గుణపాఠం తప్పదు :ఎస్సీకేఎస్ ప్రధాన కార్యదర్శి బి మధు హెచ్చరిక
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలనీ, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలంటూ ఆందోళనల్లో పాల్గొనే ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామంటూ కేంద్రంలోని బీజేపీ బెదిరింపులకు పాల్పడటాన్ని సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘం (ఎస్సీకేఎస్) ప్రధాన కార్యదర్శి బి మధు తీవ్రంగా ఖండించారు. ఆందోళనల్లో పాల్గొనడం రాజ్యాంగం కల్పించిన హక్కనీ, దాన్ని కాలరాయడం సరైంది కాదని శుక్ర వారం ఒక ప్రకటనలో తెలిపారు. పోరాటాలను అణచివేసేందుకు ఉద్యో గులను బెదిరిస్తున్నదని విమర్శించారు. ప్రభుత్వరంగాన్ని నాశనం చేస్తూ కార్మికుల హక్కులను కాలరాస్తున్నదని పేర్కొన్నారు. హక్కుల కోసం ఉద్య మిస్తున్న ఉద్యోగులు, కార్మికులపై నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నదని తెలి పారు. హక్కులను కాలరాసే కేంద్ర ప్రభుత్వానికి ఉద్యోగులు, కార్మికులు పోరాటాలతోనే బుద్ధిచెప్తారని హెచ్చరించారు. నిరంకుశంగా వ్యవహరిం చిన అనేక మంది నియంతలు కాలగర్భంలో కలిసిపోయారని విమర్శిం చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరంకుశ చర్యలను మానుకుని ఉద్యో గుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఓల్డ్ పెన్షన్ స్కీంను పునరుద్ధరించాలని కోరారు. లేదంటే గత పాలకులకు చెప్పి న విధంగా బీజేపీకి తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు.