Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతిభ కనబరిచిన వైద్య సిబ్బందికి అభినందనలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
టీబీ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామనీ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. 2025 నాటికి ఆ వ్యాధిని నిర్మూలించటమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు. ప్రపంచ టీబీ నిర్మూలనా దినోత్సవం సందర్భంగా ఉత్తర ప్రదేశ్‌లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ టీబీ అధికారులు నాలుగు అవార్డులను (నాలుగు జిల్లాలకు) అందుకున్నారు. నిజామాబాద్‌కు బంగారు, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండకు వెండి, ఖమ్మం జిల్లాకు కాంస్య పతాకాలు దక్కాయి. ఈ నేపథ్యంలో మంచి ప్రతిభ కనబరచటం ద్వారా రాష్ట్రానికి అవార్డులను తెచ్చిపెట్టిన వైద్యాధికారులను హరీశ్‌రావు అభినందించారు.