Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ కలియుగ నియంతలా వ్యవహరిస్తున్నారు
- పేపర్ లీకేజిపై కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుంది
- నిరసన కార్యక్రమాల నేపథ్యంలో ఏప్రిల్ 6 వరకు యాత్ర వాయిదా : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై లోక్‌సభ అనర్హత వేటు వేయడం దుర్మార్గమని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అదానీ కుంభకోణంపై చర్చ జరగ కుండా బీజేపీ అన్ని రకాల ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్ లోని తన నివాసంలో రేవంత్‌రెడ్డి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ నిరో చక్రవర్తిలా వ్యవహరిస్తు న్నారని విమర్శించారు. ఇలాంటి వైఖరి దుర్మార్గమన్నారు. కోర్టు కూడా 30 రోజులు అప్పీల్‌కు సమయమిచ్చిందన్నారు. అలాంటప్పుడు అనర్హత వేటు ఎందుకు? అని ప్రశ్నించారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు చేసిన పాదయాత్రలో ప్రభుత్వ వైఫల్యాలను రాహుల్ ఎండగట్టారనీ, దాన్ని మోడీ జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. మోడీ కలియుగ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదానీ,మోడీ చీకటి స్నేహంపై రాహుల్ గాంధీ నిలదీశారన్నారు. అదానీ కంపెనీల వ్యవహారాలపై జేపీసీ వేయాలని పార్లమెంట్ వేదికగా రాహుల్ పోరాటం చేయడం ప్రధాని మోడీకి కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయ న్నారు. ఈ కుట్రను న్యాయపోరాటం ద్వారా కాంగ్రెస్ ఛేదిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నిరసన కార్యక్రమాల నేపథ్యంలో పాదయాత్రను ఏప్రిల్ 6 వరకు తన పాదయాత్రను వాయిదా వేసుకున్నట్టు తెలిపారు. పేపర్ లీకేజిపై కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందన్నారు.
ప్రజాస్వామ్యానికి చీకటి రోజులు : మాణిక్ఠాక్రే
రాహుల్‌గాంధీపై అనర్హత వేటు వేయడమంటే, ప్రజాస్వామ్యానికి చీకటి రోజులేనని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్‌రావు ఠాక్రే అభిప్రాయపడ్డారు. రాహుల్‌గాంధీ లోక్‌సభ సభ్యత్వం రద్దు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. దేశంలో కాంగ్రెస్ నాయకులపై తీవ్ర నిర్బంధం, నియంత పాలన సాగుతున్నదన్నారు. మాజీ ఎంపీ మధుయాష్కీ, మహేష్‌కుమార్ గౌడ్, రోహిత్ చౌదరీ, వి హనుమంతరావు, కోదండరెడ్డి, జి. నిరంజన్, అజ్మత్, ఫహీంతో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. న్యాయపరంగా, చట్టపరంగా పోరాటం చేస్తామన్నారు. 30 రోజుల గడువు ఉండగానే ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. రాహుల్‌గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సీతక్క, జగ్గారెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మల్లు రవి, చామల కిరణ్‌రెడ్డి, అద్దంకి దయాకర్ తదితరులు వేర్వేరు ప్రకటనల్లో ఖండించారు.
ఆందోళనలకు పిలుపు : రేవంత్
కాంగ్రెస్ శ్రేణులంతా ఓయూ నిరుద్యోగ నిరసన దీక్షలో పాల్గొనాలనీ, తాను పాల్గొనేందుకు శాయ శక్తు లా ప్రయత్నిస్తానని రేవంత్‌రెడ్డి చెప్పారు. 27న జిల్లా కేంద్రాల్లో దీక్షలు చేయాలనీ, ఏప్రిల్ 1 నుంచి అన్ని యూనివర్సిటీల విద్యార్థులను కలవాలని నిర్ణయించు కున్నట్టు తెలిపారు. ముఖ్య నాయకులతో ఢిల్లీకి వెళ్లి ఈడీ,సీబీఐ డైరెక్టర్‌కు ఫిిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.