Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీడీపీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్
నవతెలంగాణ - హైదరాబాద్
తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఈసారీ ఉమ్మడిగా హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్టు ఆ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ప్రకటించారు. ప్రతినిధుల సభకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 15 వేల మంది ప్రతినిధులు హాజరవుతున్నట్టు తెలిపారు. శుక్రవారం ఎన్టీఆర్ భవన్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవ ప్రతినిధుల సభ ఏర్పాట్లపై అందుబాటులో ఉన్న రాష్ట్ర ముఖ్య నాయకులతో కాసాని భేటి అయ్యారు. ఈ సందర్భంగా కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ ఇంటింటికీ టీడీపీ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో 92 అసెంబ్లీ నియోజకవర్గాలలో పార్టీ శ్రేణులు ప్రజలతో మమేకం అవుతుండటం సంతోషమని అన్నారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ శతజయంతి వేడుకల నేపథ్యంలో 41వ పార్టీ ఆవిర్భావ దినోత్సవ ప్రతినిధుల సభకు హైదరాబాద్ వేదిక కానుండటం తెలంగాణ రాష్ట్ర టీడీపీ శ్రేణులకు గర్వకారణమన్నారు. ఈ సభను ప్రతి ష్టాత్మకంగా తీసుకొని విజయ వంతం చేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియో జకవర్గాల నుండి పార్టీ నాయకులు తప్పనిసరిగా తరలిరావాలని పిలుపు నిచ్చారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవ నేపథ్యంలో హైదరాబాద్ నగరం, శివారు ప్రాంతాల్లో అన్ని ప్రధాన రహదారులపై స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని, ప్రధాన కూడళ్లను పార్టీ తోరణాలు, జెండాలతో నగరం మొత్తం పసుపు మయం అయ్యేలా చూడాలని జీహెచ్ఎంసీ పరిధిలోని పార్టీ నాయకులకు దిశానిర్ధేశం చేశారు 29న పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని స్థానికంగా ఎక్కడికక్కడా ఘనంగా జెండా ఆవిష్కరణలు చేసుకొని మధ్యాహ్నం 3 గంటల వరకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు చేరుకోవాలని పార్టీ శ్రేణులను కాసాని సూచించారు. ఈ సమావేశంలో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి, వరంగల్ పార్లమెంట్ పరిశీలకులు మాజీ ఎమ్మెల్యే బండి పుల్లయ్య, రాష్ట్ర మీడియా కో-ఆర్డినేటర్ బియ్యని సురేష్, నగర నాయకులు రవీంద్రచారి, డాక్టర్ ఏ ఎస్ రావు, సాంబశివరావు, కోదాడ నియోజ కవర్గ నాయకులు సైదేశ్వర్రావు, తదిరులు పాల్గొన్నారు.