Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సబితకు మధుసూదన్‌రెడ్డి లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ జవాబు పత్రాల ఆన్లైన్ మూల్యాంకనానికి సంబంధించిన టెండర్‌ను రద్దు చేయాలని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం (జీజేఎల్ఏ) అధ్యక్షులు పి మధుసూదన్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డికి శుక్రవారం ఆయన లేఖ రాశారు. కోసైన్ అనే సంస్థకు టెండర్‌ను కట్టబెట్టారని తెలిపారు. ఈ టెండర్లో అనేక లోపాలున్నాయని పేర్కొన్నారు. అనుభవం, ప్రతిష్ట ఉన్న సంస్థలు కాకుండా కొన్ని సంస్థలకు అనుకూలంగా ఈ టెండర్ దరఖాస్తు పత్రాన్ని రూపొందించారని తెలిపారు. గతంలో ఈ సంస్థ టెండర్లలో పాల్గొన్నా ఒడిశా రాష్ట్ర సాంకేతిక విద్యా కౌన్సిల్, పాలమూరు విశ్వవిద్యాలయం అనుభవం లేదంటూ దరఖాస్తును తిరస్కరించాయని గుర్తు చేశారు. పది లక్షల మంది విద్యార్థుల విలువైన ఇంటర్ జవాబు పత్రాల ఆన్లైన్ మూల్యాంకనం ప్రక్రియను కోసైన్ సంస్థకు అప్పగించడం సరైంది కాదని తెలిపారు. ఆ సంస్థతో ఇంటర్ బోర్డు అధికారులు లోపాయి కారి ఒప్పందం చేసుకుని ఈ టెండర్‌ను కట్టబెట్టారని ఆరోపించారు. దీనిపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి టెండర్‌ను రద్దు చేయాలనీ, టీసీఎస్ వంటి అనుభవం ఉన్న సంస్థలకు అప్పగించాలని కోరారు.