Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐఎస్ఎఫ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ విషయంపై సిట్ విచారణ నిర్లక్ష్య పూరితంగా ఉన్నదని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠరెడ్డి, కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. ఈ ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభు త్వాన్ని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు నిరుద్యోగభృతి, ఉచిత కోచింగ్, వసతి ప్రభుత్వమే కల్పించాలని కోరారు. లీకేజీకి సంబంధించి టీఎస్పీఎస్సీ చైర్మెన్, కార్యదర్శి, సభ్యులందరినీ విచారణ చేయాలని తెలిపారు. చైర్మెన్ను వెంటనే తొలగించి టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయాలని పేర్కొన్నారు.