Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన జవాబుపత్రాల మూల్యాంకనం (స్పాట్ వాల్యుయేషన్) ప్రక్రియ వచ్చేనెల 13 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు జి రమేష్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పదో తరగతి పరీక్షలు వచ్చేనెల మూడు నుంచి 13వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని తెలిపారు. వచ్చేనెల 13 నుంచి 21వ తేదీ వరకు తొమ్మిది రోజులపాటు టెన్త్ స్పాట్ వాల్యుయేషన్ జరుగుతుందని పేర్కొన్నారు. 11 జిల్లాల్లో 18 స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.