Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ నాయకులు రాజారావు, మధు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
భగత్‌సింగ్ స్ఫూర్తితో మతోన్మాదం, ప్రయివేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుదామని సీఐటీయూ సీనియర్ నాయకులు పి రాజారావు, రాష్ట్ర కార్యదర్శి బి మధు పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్య్రం కోస 23 ఏండ్ల చిరుప్రాయంలోనే ఉరికంబమెక్కిన షహీద్ భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ 92వ వర్ధంతి కార్యక్రమం హైదరా బాద్‌లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు రాజారావు పూలమాలవేసి నివాళులర్పించారు. సీఐటీ యూ రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో రాజారావు, మధు మాట్లా డుతూ భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్దేవ్ల ఆశయాలు ఇంకా మిగిలే ఉన్నాయని చెప్పారు. వారు కలలు కన్న భారతదేశం ఇంకా నిర్మించలేదన్నారు. బ్రిటీష్ ప్రభుత్వా న్నే క్షమాభిక్ష కోరి ప్రభుత్వానికి సహకరించిన వారి వారసులు నేడు దేశంలో అధికారంలో ఉన్నారని విమ ర్శించారు. ఈ దేశాన్ని విదేశీ సంస్థలకు తాకట్టు పెడు తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మతోన్మాదం ఎంత ప్రమాదమో ఆనాడే దానికి వ్యతిరేకంగా నికరంగా పోరా డిన వ్యక్తి భగత్‌సింగ్ అని చెప్పారు. దేశ రక్షణ కోసం, కార్పొరేట్, మతోన్మాద విధానా లకు వ్యతిరేకంగా ప్రజలు, కార్మికులు, ఉద్యోగులు, రైతులు ఐక్య పోరాటా లకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ రమ, రాష్ట్ర కమిటీ సభ్యులు పి సుధాకర్, ఆఫీసు కార్య దర్శి సునీత, నాయకులు భారతి, సందీప్, అనిల్ పాల్గొన్నారు.